మొన్న శ్రీరామనవమి రోజు (Sri Rama Navami) ఆలయంలో బావి కూలి పదుల సంఖ్యలో భక్తులు (Devotees) మృత్యువాత పడిన సంఘటన మరువకముందే మరో ఘోర సంఘటన చోటుచేసుకుంది. ఓ ఆలయ ప్రాంగణంలో ఉన్న భారీ వృక్షం (Tree Fall) కుప్పకూలడంతో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన మహారాష్ట్రలో (Maharashtra) జరిగింది. ఈ ఘటనపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) సంతాపం ప్రకటించారు.
అకోల జిల్లా (Akola District) బాలాపూర్ మండలం పారాస్ గ్రామంలో బాబూజీ మహారాజ్ ఆలయం ఉంది. ఆలయంలో ఆదివారం రాత్రి 7.30 గంటల సమయంలో మహా హారతి (Maha Aarti) కార్యక్రమం నిర్వహించారు. హారతి తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. అయితే కొన్ని రోజులుగా అకోల జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఆదివారం కూడా వర్షం పడడంతో ఆలయంలో ఉన్న 100 ఏళ్ల నాటి వేపచెట్టు (Neem Tree) కుప్పకూలింది. ఆ చెట్టు సమీపంలోని రేకుల షెడ్డుపై పడిపోయింది. దీంతో షెడ్డు కూలిపోయింది. ఆ షెడ్డు లోపల భక్తులు భారీగా ఉన్నారు.
షెడ్డు పడిపోవడంతో భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. భారీ నిర్మాణం పడిపోవడంతో ఏకండా ఏడుగురు భక్తులు మృతి చెందారు. 23 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఇతర రెవెన్యూ అధికారులు సహాయ కార్యక్రమాలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. చెట్టును జేసీబీలతో తొలగించారు. శిథిలాల కింద భక్తులు చిక్కుకుని సహాయం కోసం ఆర్తించారు. ఈ సంఘటనపై డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.