Vidada Rajani : ఏపీలో కొత్తగా 267 మందికి కరోనా లక్షణాలు
ఏపీలో రెండు వారాల్లో 15,096 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని, 267 మంది కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్టు గుర్తించామని ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని (Health Minister Vidada Rajani) తెలిపారు. దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడం పట్ల కేంద్ర ప్రభుత్వం (Central Govt) రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా పరీక్షల సంఖ్య పెంచాలని స్పష్టం చేసింది.
ఏపీలో రెండు వారాల్లో 15,096 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని, 267 మంది కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్టు గుర్తించామని ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని (Health Minister Vidada Rajani) తెలిపారు. దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడం పట్ల కేంద్ర ప్రభుత్వం (Central Govt) రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా పరీక్షల సంఖ్య పెంచాలని స్పష్టం చేసింది. కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నట్టు ఆమె తెలిపారు. ఆక్సిజన్ ప్లాంట్ల (Oxygen plants) ఏర్పాటుకు, చికిత్స ఏర్పాట్ల కోసం పీహెచ్ సీల(Phc)కు నిధులు ఇవ్వాలని మంత్రి రజని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దేశంలో గడచిన 24 గంటల్లో 6 వేలకు పైగా కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో మాదిరిగానే కోవిడ్(covid)పై ముందస్తుగా అప్రమత్తం కావాలని కీలక సూచనలు చేశారు. కరోనా కొత్త వేరియంట్ BF 7 (బీఎఫ్ 7) తీవ్రత ఎలా ఉన్నా, ఎదుర్కొనే పరిస్థితులపై ముందుగానే సమాచారం సేకరించాలని.. ప్రజలను అప్రమత్తంగా ఉంచేలా అవగాహన కల్పించాలని మంత్రి విడదల రజినీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి హెల్త్ సెంటర్లో ర్యాపిడ్ టెస్టులు (Rapid tests) నిర్వహించేలా కిట్లు సిద్ధం చేయాలని ఆమె ఆదేశించారు.