ASR: జీ. మాడుగుల మండల డిప్యూటీ తహసీల్దార్ గిడ్డి రాజ్ కుమార్‌కు పదోన్నతి లభించింది. ఆయనను జీ. మాడుగుల మండల తహసీల్దార్‌గా నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయన జీ. మాడుగల మండల తహసీల్దార్‌గా నూతనంగా బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ, సక్రమంగా రెవెన్యూ సేవలు అందిస్తామని తెలిపారు.