BHPL: చిట్యాల మండల కేంద్రంలో శుక్రవారం జరిగే మహిళా శక్తి సంబరాలకు మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరవుతారని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల సాధికారత కోసం వడ్డీ రహిత రుణాలు, ఉపాధి అవకాశాలు, ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందిస్తోందన్నారు. ఈ కార్యక్రమానికి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.