HNK: ఐనవోలు మండలంలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. పర్యటనలో భాగంగా రాంనగర్ గ్రామానికి వెళ్లారు. అక్కడ రాష్ట్ర టెస్కాబ్ ఛైర్మన్ రవీందర్ రావు, గౌడ కులస్తుల కోరిక మేరకు ఆకుపట్టి కల్లు తాగారు. ఈ నేపథ్యంలో గీత కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.