హైదరాబాద్ కలెక్టర్ రెడ్ హిల్స్‌లో GHMC పారిశుద్ధ్య కార్మికుల కోసం వైద్య ఆరోగ్య శాఖ, రోటరీ క్లబ్, సర్వజన ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన వైద్య శిబిరాన్ని కలెక్టర్ హరిచందన సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వర్షాకాలంలో ముందుండి పనిచేసే కార్మికుల ఆరోగ్య రక్షణకు తరచూ ఆరోగ్య పరీక్షలు చేయడం అత్యంత అవసరమని పేర్కొన్నారు.