కోనసీమ: పులస చేపల క్రేజ్ ఎంతగానో పెరిగిపోయింది. గోదావరిలో వరదల సమయంలో మాత్రమే దొరికే ఈ అరుదైన చేప కోసం మాంస ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పటివరకు పులస జాడ కనిపించలేదు. పులస పడితే ముందుగా తనకే ఇవ్వాలని అమలాపురానికి చెందిన ఓ ప్రముఖ రైస్ వ్యాపారి బోడసకుర్రు మత్స్యకార మహిళలకు రూ. 10,000 అడ్వాన్స్ కూడా ఇచ్చారు.