MNCL: కోటపల్లి మండలంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల ఎదుట BRS నాయకులు ఆందోళన చేపట్టారు. పాఠశాలలోని విద్యార్థినులను వేధించి, అసభ్యంగా ప్రవర్తించిన ప్రధానోపాధ్యాయుడిని వెంటనే సస్పెండ్ చేయాలని నియోజకవర్గ నాయకుడు రమేష్ డిమాండ్ చేశారు. కానీ అధికారులు సస్పెండ్ చేయకుండా బదిలీ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.