KMM: తెలంగాణ రాష్ట్ర వైద్య విధాన్ పరిషత్ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు విడుదల చేయాలని నిరసిస్తూ.. బుధవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు ఒంటి కాలుపై నిరసన వ్యక్తం చేశారు. సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వేము రాంబాబు మాట్లాడుతూ.. గత కొన్ని నెలలుగా కార్మికులకు వేతనాలు అందకపోవడంతో పూట గడవడం లేదని, వెంటనే వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.