KMM: సత్తుపల్లి, పెనుబల్లి మండలాల్లో బుధవారం ఎమ్మెల్యే మట్టా రాగమయి పర్యటించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ముందుగా సత్తుపల్లిలోని రాణి ఫంక్షన్ హాల్లో జరిగే ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో పాల్గొని స్వయం సహాయక బృందాలకు వడ్డీ లేని రుణాల చెక్కులు పంపిణీ చేయనున్నారు. అనంతరం పాత కుప్పెనకుంట్ల గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభిస్తారు.