GNTR: గుంటూరులోని బ్రాడిపేటలో ఉన్న శ్రీ గౌరీ విశ్వేశ్వరస్వామి దేవాలయంలో ఆదివారం సాయంత్రం శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. లక్ష్మీ నారాయణ స్వామికి పురోహితులు సుదర్శన, అష్టాక్షరీ మంత్రాలతో హోమాలు జరిపారు. అనంతరం లక్ష తులసీ దళాలతో అర్చన, మంత్రపుష్పాలు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.