TPT: ఓజిలి మండల ఎస్సైగా కుర్రా శ్రీకాంత్ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధ్యతతో విధులు నిర్వహిస్తూ స్టేషన్కు వచ్చే వారితో ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వహించి చట్టపరంగా వారికి అవసరమైన రక్షణ చర్యలు చేపడతానని తెలిపారు. స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేస్తూ క్రైమ్ రేట్ తగ్గిస్తానని స్పష్టం చేసారు.