ATP: పామిడి మండలంలో ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలని కోరుతూ గురువారం ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఎంఈవో జయ నాయక్‌కు వినతి పత్రం అందజేశారు. ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు వినోద్ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలు పాటించని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని, విద్యాసంస్థల బస్సుల సౌకర్యం నిర్లక్ష్యంగా ఉందని వారు పేర్కొన్నారు.