NLR: వరికుంటపాడు మండలం తూర్పు బోయమడుగుల మండల ప్రజా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న టీచర్ లోకసాని వెంగయ్య బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో తల్లిదండ్రులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు DEO డాక్టర్ ఆర్ బాలాజీ రావు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు MEO -2 రమణయ్య తెలిపారు. సస్పెండ్ కాపీ ఇచ్చేందుకు టీచర్ అందుబాటులో లేరని తెలిపారు.