CTR: ఎస్ఆర్ పురం మండలం ముది కుప్పం పంచాయతీలో గురువారం సుపరిపాలనపై ప్రచార కార్యక్రమం మండల అధ్యక్షుడు గంధమనేని జయశంకర్ నాయుడు ప్రారంభించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించి కరపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కుమార్, నిరంజన్ రెడ్డి, పైనేని మురళి, కేఎం రవి పాల్గొన్నారు.