KNR: జిల్లాలోని మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 31 వరకు నిర్వహించనున్న ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సమన్వయ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా బాలబాలికలకు పని నుంచి విముక్తి కల్పించి తల్లిదండ్రుల చెంతకు చేర్చాలని అన్నారు.