SKLM: లావేరు మండలం మురపాక గ్రామ పంచాయతీ నిధులతో వీధిలైట్లు వేసినట్లు సర్పంచ్ పెయ్యిల లక్ష్మణరావు తెలిపారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలో భాగంగా వీధి లైట్లు మరమ్మతులు చేస్తున్నామన్నారు. ఇంకా ఎక్కడైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు. ఈ మేరకు వీధి లైట్లు ఏర్పాటుకు చొరవ తీసుకున్న సర్పంచ్‌ను గ్రామస్థులు అభినందించారు.