PPM: ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టిని మంగళవారం కలిశారు. విశాఖలో డీఐజీని కలిసి పార్వతిపురం జిల్లాలో పోలీస్ స్టేషన్లలో మౌలిక వసతులు కల్పనకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పార్వతీపురంలోని పోలీస్ స్టేషన్ అభివృద్ధి చేసి ఆధునిక వసతులు కల్పించాలని కోరారు. పాత పోలీస్ స్టేషన్ల స్థానంలో కొత్తపోలీస్ స్టేషన్ల నిర్మించాలన్నారు.