KKD: ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి మంగళవారంతో గడువు ముగుస్తోందని ప్రిన్సిపల్ డి. సునీత ఓ ప్రకటనలో వెల్లడించారు. బీఎస్సీ వృక్ష శాస్త్రం, కంప్యూటర్స్, రసాయన శాస్త్ర కోర్సులు బీఏ ఎకానమిక్స్, బీకాం కంప్యూటర్ కోర్సులు కళాశాలలో అందుబాటులో ఉన్నాయన్నారు. విద్యార్థులు సాయంత్రం 5 గంటల లోపు ధ్రువపత్రాలతో హాజరు కావాలన్నారు.