KNR: తిమ్మాపూర్లోని గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో కరీంనగర్ జిల్లాలోని గ్రామీణ నిరుద్యోగ మహిళలకు ఉచితంగా టైలరింగ్ శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ ప్రిన్సిపల్ తెలిపారు. జూన్ 9 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. 19-45 సం.రాల వయసున్న మహిళలు అర్హులని, శిక్షణ కాలం నెల రోజులలో ఉచిత భోజనం వసతి కల్పిస్తామని తెలిపారు.