దాడుల్లో భాగంగా పాక్ డ్రోన్లు, లాంగ్ టార్గెట్ మిస్సైల్స్ వాడుతోందని ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తెలిపారు. ‘పంజాబ్లోని పలు ఎయిర్బేస్లను, శ్రీనగర్లో స్కూళ్లు, ఆస్పత్రులను పాక్ లక్ష్యంగా చేసుకుంది. పాక్ దాడుల నుంచి ఆస్తి, ప్రాణనష్టాన్ని తగ్గించగలిగాం. భారత ఎయిర్బేస్లను ధ్వంసం చేసినట్లు పాక్ తప్పుడు ప్రచారం చేస్తోంది’ అని అన్నారు.