»Any College Will Be Proud If Uddhavs Dig At Pm Over Degree
Uddav Thakre మోదీపై కామెంట్స్..! ఆ విషయం చెప్పడానికి సిగ్గు ఎందుకు..?
Uddav Thakre : ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీ క్వాలిఫికేషన్ పై గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఈ వివాదాన్ని మొదట మొదలుపెట్టింది.. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్. మోడీ డిగ్రీ సర్టిఫికెట్ వివరాలు కావాలని అడిగినందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు గుజరాత్ హైకోర్టు రూ. 25 వేలు జరిమానా విధించిన విషయం తెలిసిందే.
ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీ క్వాలిఫికేషన్ పై గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఈ వివాదాన్ని మొదట మొదలుపెట్టింది.. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్. మోడీ డిగ్రీ సర్టిఫికెట్ వివరాలు కావాలని అడిగినందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు గుజరాత్ హైకోర్టు రూ. 25 వేలు జరిమానా విధించిన విషయం తెలిసిందే. అయితే ఈఅంశంపై సేన చీఫ్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే మోదీపై విమర్శలు గుప్పించారు.
దేశంలో ఎంతో మంది డిగ్రీ చదివిన యువత ఉద్యోగాలు లేకుండా ఉన్నారని… మోదీని డిగ్రీ సర్టిఫికెట్ చూపించమని అడిగినందుకు రూ. 25 వేలు ఫైన్ విధించారని థాక్రే విమర్శించారు. డిగ్రీ ఎక్కడ చదివారో చెప్పుకోవడానికి సిగ్గెందుకని ప్రశ్నించారు. ప్రధాని తమ కాలేజీలో చదివారని ఆ కాలేజీ వాళ్లు గొప్పగా చెప్పుకోవచ్చని అన్నారు.
ముఖ్యమంత్రి కావాలనే కోరికతో సిద్ధాంతాల పరంగా విరుద్ధమైన కాంగ్రెస్, ఎన్సీపీలతో పొత్తు పెట్టుకున్నారంటూ థాక్రే పై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఆయన స్పందిస్తూ… ‘అవును, మేము అధికారం కోసమే కలిశాం. అధికారాన్ని కోల్పోయిన తర్వాత కూడా తాము కలిసే ఉన్నాం. మరింత బలంగా తయారయ్యాం’ అని అన్నారు.
ఎన్నికలు వచ్చిన ప్రతిసారి హిందుత్వ పేరుతో ప్రజలను బీజేపీ నేతలు రెచ్చగొడుతుంటారని థాక్రే మండిపడ్డారు. మనకు గొప్ప హిందూ ప్రధాని ఉన్నారని గొప్పలు చెప్పుకుంటుంటారని… ఈ గొప్పదనం వల్ల దేశానికి ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు. తాను హిందుత్వను వదిలేశానని విమర్శిస్తున్నారని… తాను హిందుత్వను వదిలి పెట్టానని చెప్పడానికి ఒక్క ఉదాహరణ అయినా చూపించాలని సవాల్ విసిరారు. న్యాయ వ్యవస్థను కూడా గుప్పిట్లోకి తీసుకోవడానికి బీజేపీ యత్నిస్తోందని… కానీ, న్యాయ వ్యవస్థ వారికి లొంగడం లేదని చెప్పారు.