చిత్తూరు: నియోజకవర్గంలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి శుక్రవారం పర్యటిస్తారని ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 11కు జీడి నెల్లూరు మండలం బుగ్గపట్నం కుప్పమ్మ దేవస్థానంలో ఎంపీపీ అనిత, సర్పంచ్ ముని రాజారెడ్డి ఆధ్వర్యంలో జరిగే ప్రత్యేక పూజల్లో పాల్గొంటారని తెలిపారు. 12 గంటలకు పెనుమూరు మండలం కండిగ గ్రామంలో పర్యటిస్తారని వెల్లడించారు.