BPT: బాపట్ల మున్సిపాలిటీ పరిధిలోని భీమావారి పాలెంలో గురువారం జిల్లా కలెక్టర్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. భీమావారి పాలెంలోని వృద్ధులు, వికలాంగుల ఇళ్లకు వెళ్లి సిబ్బందితో కలిసి పంపిణీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్లను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఆయన వెంట కార్యాలయ సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.