KMM: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించిన ఖమ్మం పోలీస్ కమిషనరేట్‌లోని పోలీస్ సంక్షేమ ఉన్నత పాఠశాల విద్యార్థులను స్కూల్ చైర్ పర్సన్ నిష్టాశర్మ అభినందించారు. విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో ఉపాధ్యాయులు దిక్సూచి పాత్ర పోషించారని చెప్పారు. పరీక్షలకు మొత్తం 54 మంది హజరు కాగా 51 మంది విద్యార్థులు ఫస్ట్ క్లాసులో ఉత్తీర్ణత సాధించారన్నారు.