ATP: మడకశిర మండలం కళ్లుమర్రి గ్రామ సమీపంలో బుధవారం పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ క్రమంలో నలుగురు వ్యక్తులు పోలీసులను చూసి బైకుల్లో పరారయ్యారు. గమనించిన CIనగేశ్ బాబు పోలీసు సిబ్బందితో కలిసి వెంబడించి పట్టుకున్నారు. వారిని తమదైన శైలిలో విచారించగా ఈనెల 18న దంపతులను బెదిరించి నగలు దోచుకున్నట్లు నేరాన్ని అంగీకరించారు. వారిపై కేసునమోదు చేసినట్లు తెలిపారు.