VZM: రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణికి పాచిపెంట మండలం కొత్తవలస, మిర్తివలస గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. గురువారం మండల స్థాయి పార్టీ సమావేశానికి విచ్చేసిన ఆమెకు స్థానిక గ్రామ ప్రజలు కోలాట నృత్యాలు, గజ మాలలతో స్వాగతం పలికారు. మండల కార్యకర్తలు మధ్యాహ్నం ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో సమావేశం అవ్వనున్నారు.