KRNL: ఆస్పరి మండలం మత్తుకూరు గ్రామానికి చెందిన ఈరన్న, ఆయన కూతురు శ్రావణి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం విషయం తెలిసిన ఎమ్మెల్యే విరుపాక్షి హాస్పటల్‌కు వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఎమ్మెల్యే వెంట వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.