ఆఫ్ఘానిస్తాన్లో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదైనట్లు యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. బాగ్లాన్ నగరానికి తూర్పున 164 కి.మీ దూరంలో భూఉపరితలం నుంచి 121 కి.మీ లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు పేర్కొంది. కాగా.. ఈ భూప్రకంపనలు ఢిల్లీ తాకినట్లు తెలుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్లు సమాచారం.