NZB : బీజేపీ నిజామాబాద్ జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జిగా వడ్డేపల్లి మాజీ సర్పంచి కూరేళ్ల శ్రీధర్ నియమితులయ్యారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ఒక ప్రకటన విడుదల చేశారు. తనపై నమ్మకం ఉంచి జిల్లా సోషల్ మీడియా బాధ్యత ఇచ్చిన ఎంపీ అర్వింద్‌కు, ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్య నారాయణ, రాకేశ్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.