NDL: శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ ఫారెస్ట్ సిబ్బందిపై దాడి చేయడం హేయమైన చర్య అని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. బుడ్డా రాజశేఖర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, ఆయనపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.