TG: కాంగ్రెస్ ఎన్నికల హామీ మేరకు బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం కోటా కేటాయించిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. ‘కులగణన, OBC రిజర్వేషన్లు.. రాజ్యాంగ పరిరక్షణలు’ అంశంపై నిర్వహించిన సదస్సులో మాట్లాడారు. అసెంబ్లీలో బీసీ బిల్లును ఆమోదింపజేసి.. బిల్లుపై గవర్నర్‌తో సంతకం చేయించకపోవడం విడ్డూరమని పేర్కొన్నారు.