AP: అంతరిక్షం నుంచి భూమి మీదకు చేరుకున్న సునీతా విలియమ్స్ బృందానికి రాష్ట్ర అసెంబ్లీ అభినందనలు తెలిపింది. వ్యోమగాములు రోదసి నుంచి సురక్షితంగా తిరిగి రావటం శుభ పరిణామమని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. యావత్ మానవాళికి వారు స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు. మానవాళి నిరంతర ప్రగతికి ఇలాంటి ప్రయాణాలు కీలకమని పేర్కొన్నారు.