KNR: హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి తగిన నిధులు మంజూరు చేయాలని MLA పాడి కౌశిక్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి భారీగా నిధులు కేటాయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలతో పాటు మా నియోజకవర్గానికి ప్రత్యేకంగా రూ.1,000 కోట్ల నిధులు మంజూరు చేయాలని కౌశిక్ రెడ్డి కోరారు.