KNR: పర్యావరణ పరిరక్షణలో పిచ్చుకల పాత్ర కీలకమని, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మంగళవారం ఉదయం కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన ప్రపంచ పిచ్చుకల దినోత్సవ సందర్భంగా 2025 కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హాజరై, మాట్లాడుతూ.. పిచ్చుకలు పర్యావరణ మిత్రులని తెలిపారు. నేడు జీవవైవిద్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.