SRCL: వేసవి కాలంలో జిల్లాలో ఎక్కడ త్రాగునీటి ఇబ్బందులు రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ త్రాగు నీటి సరఫరా, సమ్మర్ యాక్షన్ ప్లాన్‌పై సంబంధిత అధికారులతో సమీక్షించారు.