కాకినాడ: జిల్లా ఎండోమెంట్ ఆఫీసర్ ఈవీ సుబ్బారావును మంగళవారం అర్చక సంఘాల ప్రతినిధులు కాకినాడలో కలిశారు. ఈ సందర్భంగా ఆయనను సత్కరించారు. తూర్పు గోదావరి జిల్లా ప్రతినిధులు చక్రవర్తుల గోపి, దొంతుకుర్తి ఈశ్వర శర్మ అర్చక సమస్యల పరిష్కారానికి సహకరించాలని ఆయనను కోరారు. అర్చకుల సమస్యలకు కృషి చేస్తానని, ప్రథమ ప్రాధాన్యత ఇస్తానని డీఈవో సుబ్బారావు హామీ ఇచ్చారు.