KKD: సామర్లకోట స్టేషన్ సెంటర్లో ఓ బాలుడు తప్పిపోయి తిరుగుతుండగా సామర్లకోట ట్రాఫిక్ ఎస్సై అడపా గరగారావు గుర్తించి, తల్లిదండ్రులకు అప్పగించిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లో బాలుడు తప్పిపోయి తిరుగుతున్నాడని కొందరు వ్యక్తులు ట్రాఫిక్ ఎస్సై దృష్టికి తీసుకురావడంతో గరగారావు స్పందించారు. విచారణ అనంతరం బాబును తల్లిదండ్రులకు అప్పగించారు.