KRNL: గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న గ్రామ ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు పదోన్నతి చానల్‌ను ఏర్పాటు చేయాలని మంగళవారం పెద్దకడబూరు మండల పరిషత్ ఆఫీసులో ఏఈ మల్లయ్యకు వీఈఏలు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సచివాలయ ఇంజనీర్స్ అసోసియేషన్ మండల కార్యదర్శి రంగన్న మాట్లాడుతూ.. గ్రామాల్లో పనిచేస్తున్న వీఈఏలచే అన్ని శాఖల పనులు చేస్తున్నారన్నారు.