కడప: వేంపల్లె మండలం కత్తులూరు గ్రామ సమీపంలోని ముగ్గురాయి మైనింగ్‌లో మంగళవారం ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి చెందారు. వేముల మండలం అమ్మయ్య గారి పల్లెకు చెందిన చిట్టిబోయిన రామచంద్ర ముగ్గురాయి మైనింగ్ పనులు చేస్తుండగా ఒక్కసారిగా మట్టి పడింది. ఈ మట్టిలో రామచంద్ర కూరుకుపోవడంతో మృతి చెందినట్లు సమాచారం. మట్టిలో కూరుకుపోయిన రామచంద్ర మృతదేహాన్ని కూలీలు వెలికితీశారు.