కడప: లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ నిచ్చే చట్టం పోక్సో యాక్ట్ అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎస్.బాబా ఫక్రుద్దీన్ పేర్కొన్నారు. మంగళవారం ఒంటిమిట్ట ఎంపీడీవో కార్యాలయంలో పోక్సో చట్టం మొదలు పలు అంశాలపై సెన్సిటైజేషన్, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోక్సో చట్టం ప్రకారం లైంగిక నేరాలకు పాల్పడే కఠినమైన శిక్షలు ఉంటాయన్నారు.