KDP: ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ నిధులు అందజేయాలని వైసీపీ మండల ప్రధాన కార్యదర్శి రామచంద్రరెడ్డి కోరారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి నిబంధన లేకుండా భూమి కలిగిన రైతుకు నిధులు అందజేయాలని కోరారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతున్నారని, ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేసి కొనుగోలు చేయాలని కోరారు.