KMM: తల్లాడ మండల కేంద్రంలో సోమవారం పలు అభివృద్ధి పనులకు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దగ్గుల నాగిరెడ్డి శంకుస్థాపన చేశారు. సీసీ రోడ్డు లేక స్థానిక ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే రాగమయి ప్రభుత్వం నుంచి నిధులను మంజూరు చేయించి పనులను చేపట్టినట్లు పట్టణ అధ్యక్షుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.