PPM: అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితం చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ అన్నారు. పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకొని కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో BC సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి చిత్రపటానికి పూలమాలలు వేశారు.