TG: HYD రామాంతపూర్‌లో జరిగిన శ్రీకృష్ణ శోభాయాత్రలో విద్యుత్ షాక్‌తో ఐదుగురు మృతి చెందిన ఘటనపై మాజీ మంత్రి KTR తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన తనను కలిచివేసిందని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మృతుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.