APT: విద్యుత్ షాక్‌కు గురై చిన్నారి మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. డి. హీరేహాళ్ మండలం మురిడికి చెందిన 6 ఏళ్ల చిన్నారి అర్పిత స్నానం చేసేందుకు వెళ్తుండగా డోర్‌కు ప్రమాదవశాత్తు విద్యుత్ ప్రవహించి పడిపోయింది. గమనించిన తల్లి రూతమ్మ వెంటనే రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రి తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన ఆ ఇంట విషాదం నింపింది.