ATP: వైసీపీ హయాంలో చెత్తపైనా పన్ను వేశారని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ విమర్శించారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రాగానే చెత్త పన్నును రద్దు చేసిందని తెలిపారు. పట్టణ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో అమృత్ స్కీం కింద నిధులను పక్కదారి పట్టించారని ఆరోపించారు.