GNTR: జిల్లాకు చెందిన అరిగెల భార్గవ్ బ్యాడ్మింటన్‌లో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ సత్తా చాటుతున్నాడు. తాజాగా జూనియర్ వరల్డ్ ర్యాంకింగ్స్ డబుల్స్ విభాగంలో ఉమ్మడి కడప జిల్లా రైల్వేకోడూరుకు చెందిన గొబ్బూరి విశ్వతేజతో కలిసి వరల్డ్ నంబర్-1 స్థానంలో నిలిచాడు. ఈ మేరకు గుంటూరు జిల్లాకు చెందిన పలువురు భార్గవ్‌ను అభినందిస్తున్నారు.