NLR: తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికైన నెల్లూరు జిల్లా నేత బీద రవిచంద్ర సోమవారం ఉదయం విజయవాడలో శ్రీ కనకదుర్గమ్మ తల్లిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం అర్చకులు ఆయనను ఆశీర్వదించారు. ఇవాళ అసెంబ్లీలో రవిచంద్ర నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి నెల్లూరు జిల్లా నుంచి పలువురు నేతలు తరలివెళ్లారు.