KKD: గొల్లప్రోలు మండలం చేబ్రోలు పవన్ కళ్యాణ్ నివాసంలో జనసేన పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆవిర్భావ సభకు పిఠాపురం నియోజవర్గ పరిశీలకులుగా దాసరి రాజు, PM రాజులను అధినేత పవన్ కళ్యాణ్ నియమించినట్లు తెలిపారు.